పతంగుల పండగకు చెరువుల సుందరీకరణ.. పనులను పరిశీలించిన హైడ్రా చీఫ్

by Kema Shiva Kumar |

హైడ్రా అభివృద్ధి చేసిన చెరువులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గురువారం సందర్శించారు.

పతంగుల పండగకు చెరువుల సుందరీకరణ.. పనులను పరిశీలించిన హైడ్రా చీఫ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైడ్రా అభివృద్ధి చేసిన చెరువులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గురువారం సందర్శించారు. హైడ్రా అభివృద్ధి చేసిన చెరువుల చెంత పతంగుల పండుగను పెద్దఎత్తున నిర్వహించాలని ప్రభుత్యం నిర్ణయించిన నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. కూకట్‌పల్లి నల్ల చెరువుతో పాటు మాదాపూర్లోని తమ్మిడికుంట, పాత‌బ‌స్తీలోని బమ్-రుక్-ఉద్- దౌలా చెరువులను సందర్శించారు. మూడు నాలుగు రోజుల్లో సుందరీకరణ పనులు పూర్తి చేసి వేడుకలకు వేదికలు సిద్ధం చేయాలన్నారు. అనంతరం లైటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. మొక్కలను విరివిగా నాటి చెరువులను సుందరీకరించాలని కోరారు. చెరువుల పరిరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం జరగకూడదని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. చెరువుల పరిసరాలు ప్రజలకు ఆకర్షణీయంగా ఉండేలా అభివృద్ధి చేయాలని, నడక మార్గాలు, లైటింగ్‌, శుభ్రత పనులు, భద్రతా ఏర్పాట్లను వేగవంతం చేయాలని సూచించారు. పండగ నాటికి చెరువులు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండేలా పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు.

Next Story