Trivikram: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌కు షాకిచ్చిన ట్రాఫిక్ పోలీసులు

by Disha Web Desk 2 |
Trivikram: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌కు షాకిచ్చిన ట్రాఫిక్ పోలీసులు
X

దిశ, బంజారాహిల్స్: గత కొన్నిరోజులుగా ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్‌లో తనిఖీలు ముమ్మరం చేశారు. సోమవారం తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అటుగా వచ్చిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కారును అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కారుకున్న బ్లాక్ ఫిల్మ్‌ను తొలగించారు. ఆ తరువాత ఆయనకు రూ.700 జరిమానా విధించారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. కార్లకు ఉన్న బ్లాక్ ఫిల్మ్‌లను తొలగించి భారీ జరిమానాలు విధిస్తున్నారు. ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మంచు మనోజ్, నందమూరి కళ్యాణ్ రామ్ కార్లకు బ్లాక్ ఫిల్మ్ తొలగించి, జరిమానాలు విధించారు.



Next Story

Most Viewed