- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HYD: జూబ్లీహిల్స్ పీఎస్ ఎదుట తీవ్ర ఉద్రిక్తత
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్(Jubilee Hills Police Station) వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పోలీసులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో పరిస్థితి ముదిరి పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు. ఇదిలా ఉంటే.. ఫోన్ ట్యాపింగ్ కేసులో(Phone Tapping Case) మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) సిట్ ముందు విచారణకు అయ్యారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ఆయన హాజరు కాగా, ఐదు గంటలుగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో అధికారులు విచారిస్తున్నారు. ఈ కేసులో సుదీర్ఘంగా విచారణ జరిపి హరీష్ రావు స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్నారు. 2024 మార్చి 10న నమోదైన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా రోజువారీ విచారణ కొనసాగుతోందని.. అందులో భాగంగానే హరీష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.






