ఏఐతో హైదరాబాద్‌ పోలీసుల సరికొత్త ప్రయోగం

by Gantepaka Srikanth |

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఏఐ ఆవిష్కరణలే కనిపిస్తున్నాయి.

ఏఐతో హైదరాబాద్‌ పోలీసుల సరికొత్త ప్రయోగం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ఎక్కడ చూసినా ఏఐ(AI) ఆవిష్కరణలే కనిపిస్తున్నాయి. ఏనోట విన్నా ఇదే పేరు మారు మోగిపోతోంది. భవిష్యత్‌ అంతా ఈ టెక్నాలజీదే అంటూ టెక్‌ నిపుణులు జోస్యం చెబుతున్నారు. సులభంగా ఉద్యోగాలు పొందాలంటే.. సాఫ్ట్‌వేర్‌ రంగంలో కొనసాగాలంటే AI నేర్చుకోవడం తప్పదని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్(Artificial Intelligence) ద్వారా ఎఫ్‌ఐఆర్ నమోదుకు శ్రీకారం పట్టారు. ముఖ్యంగా సైబర్ బాధితులకు అండగా ఉండేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఈ సరికొత్త ప్రయోగం ప్రారంభించారు. ఇదిలా ఉంటే.. కేంద్ర ప్రభుత్వం కూడా ఏఐపై ఫోకస్ చేస్తోంది. ఇటీవల ఉచితంగా AI శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ప్రోగ్రామ్‌కు AI ఫర్ ఇండియా 2.0 అని పేరు పెట్టారు. దేశ యువతకు స్కీల్ డెవలప్‌మెంట్, ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పర్యవేక్షణలో శిక్షణ ప్రారంభించారు.

Next Story