- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫోర్బ్స్ జాబితాలో హైదరాబాద్ కుర్రాడు
ఫోర్బ్స్ '30 అండర్ 30 ఆసియా-2026' జాబితాలో హైదరాబాద్ కుర్రాడికి చోటు దక్కింది.

దిశ, వెబ్ డెస్క్ : ఫోర్బ్స్ '30 అండర్ 30 ఆసియా-2026' జాబితాలో హైదరాబాద్ కుర్రాడికి చోటు దక్కింది. 'సోషల్ ఇంపాక్ట్' కేటగిరీలో హైదరాబాద్‌కు చెందిన 26 ఏళ్ల యువ పారిశ్రామికవేత్త మధులాష్ బాబు క్రొవ్విడి స్థానం సంపాదించాడు. భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని చేరవేయడమే ధ్యేయంగా 2023లో 'ఎడోద్వజ ఫౌండేషన్' (Edodwaja Foundation) అనే చారిటబుల్ సంస్థను స్థాపించారు. మల్లా రెడ్డి విద్యాసంస్థల నుండి బీటెక్, ఎంబీఏ పూర్తి చేసిన ఆయన, ప్రయోగశాలలు లేని ప్రభుత్వ పాఠశాలల పిల్లల కోసం ఒక టూర్ బస్సును సోలార్ పవర్‌తో నడిచే మొబైల్ ల్యాబ్‌గా మార్చి, దానికి 'FLOW' (Futuristic Lab On Wheels) అని పేరు పెట్టారు.
ఈ కదిలే ఆధునిక ల్యాబ్ ద్వారా మారుమూల గ్రామాల్లోని విద్యార్థులకు రోబోటిక్స్, 3D ప్రింటింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT), ఏఐ (AI) వంటి సరికొత్త హార్డ్‌వేర్ పరికరాలతో స్వయంగా ప్రయోగాలు చేసే (Hands-on experience) అరుదైన అవకాశాన్ని కల్పించారు. తెలంగాణలోని 33 జిల్లాల్లో విజయవంతంగా సాగిన 'కలాం స్ఫూర్తి యాత్ర'తో సహా ఈ వినూత్న మొబైల్ ల్యాబ్ ద్వారా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 60,000 మందికి పైగా గ్రామీణ విద్యార్థులకు ఉచితంగా సాంకేతిక విద్యను అందించి, వారిలో విద్యా స్ఫూర్తిని రగిల్చినందుకు గాను మధులాష్ బాబుకు ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ గౌరవం దక్కింది.






