కళ్ళముందే భార్య తలపై నుంచి వెళ్ళిన లారీ.. మెంటల్ షాక్ కు గురైన భర్త

by Muthe.Rajitha |

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య తన కళ్ళముందే ప్రమాదవశాత్తు లారీ కిందపడి ప్రాణాలు వదలడంతో.. భర్త మెంటల్ షాక్ కు గురయ్యాడు.

కళ్ళముందే భార్య తలపై నుంచి వెళ్ళిన లారీ.. మెంటల్ షాక్ కు గురైన భర్త
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. తను ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య తన కళ్ళముందే ప్రమాదవశాత్తు లారీ కిందపడి ప్రాణాలు వదలడంతో.. భర్త మెంటల్ షాక్ కు గురయ్యాడు. నగరంలోని బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ విషాదం ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఓల్డ్ సిటీలో నివసించే అహ్మద్ పాషా అనే వ్యక్తికి ఇటీవల 3 నెలల క్రితమే వివాహం జరిగింది. బక్రీద్ సందర్భంగా బంధువులతో సంతోషంగా గడిపి భార్యను తీసుకొని ఇంటికి బైక్ మీద వెళ్తుండగా.. యూటర్న్ తీసుకుంటున్న క్రమంలో పాషా బైక్ స్లిప్ అయి ఇద్దరూ కింద పడ్డారు. అయితే వెనకాలే వేగంగా వస్తున్న లారీ ఒక్కసారిగా ఆమె తలపై నుంచి వెళ్లడంతో.. తల నుజ్జునుజ్జయ్యి అక్కడికక్కడే మరణించింది. తాను ఎంతగానో ప్రేమించిన భార్య తన కళ్లముందే క్షణాల్లో ప్రాణాలు వదలడంతో అహ్మద్ పాషా మెంటల్ షాక్ కు గురయ్యాడు. బిగ్గరగా ఏడుస్తూ.. భార్య లేకుండా తాను ఉండలేనని, చచ్చిపోతానంటూ ఎదురుగా వస్తున్న వాహనాల కింద పడబోయాడు. స్థానికులు వెంటనే అప్రమత్తమైన స్థానికులు అతణ్ణి కాపాడారు. అయినప్పటికీ అతని మానసిక పరిస్థితి విపరీతంగా మారడంతో పోలీసుల సహాయంతో ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story