- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళా ఎంపీటీసీపై భర్త దాడి.. కేసు నమోదు చేసిన పోలీసులు
by S Gopi |
దిశ, మాచారెడ్డి: మండల కేంద్రమైన మాచారెడ్డి ఎంపీటీసీ రావుల వినోదపై..Husband attack on female MPTC

X
దిశ, మాచారెడ్డి: మండల కేంద్రమైన మాచారెడ్డి ఎంపీటీసీ రావుల వినోదపై ఆమె భర్త రావుల ప్రభాకర్ దాడికి పాల్పడడంతో అతనిపై కేసు నమోదు చేసినట్లు మాచారెడ్డి ఎస్ఐ సంతోష్ కుమార్ తెలిపారు. వివరాల్లోకి వెళితే.. కొంతకాలం నుంచి ఎంపీటీసీ వినోదను ఆమె భర్త ప్రకాష్ మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి మద్యం సేవించి వినోదపై దాడి చేయడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమె మాచారెడ్డి పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు వినోద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Next Story






