- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డెలివరీ ఏజెంట్‌కు లిఫ్ట్ నిరాకరణ.. భారీ మూటతో 6 అంతస్తులు మెట్లెక్కడంతో..
మరోసారి అపార్ట్‌మెంట్ సంస్కృతిలో మానవత్వం కనుమరుగైంది. గతంలో ఇలాంటి ఎన్నో ఘటనలు చోటు చేసుకున్నప్పటికి అపార్ట్మెంట్ల రూల్స్ మారడం లేదు.

దిశ, వెబ్ డెస్క్: మరోసారి అపార్ట్‌మెంట్ సంస్కృతి (Apartment culture)లో మానవత్వం కనుమరుగైంది. గతంలో ఇలాంటి ఎన్నో ఘటనలు చోటు చేసుకున్నప్పటికి అపార్ట్మెంట్ల రూల్స్ మారడం లేదు. తాజాగా అపార్ట్‌మెంట్ వాసుల కర్కషత్వానికి నిదర్శనంగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారీ పార్శిల్‌తో వచ్చిన ఒక డెలివరీ ఏజెంట్ (Delivery agent)కు సెక్యూరిటీ గార్డు లిఫ్ట్‌లోకి అనుమతి నిరాకరించడంతో, సదరు ఏజెంట్ గత్యంతరం లేక ఆ బరువును మోస్తూ 6వ అంతస్తు వరకు మెట్లెక్కాల్సి వచ్చింది.
మెట్లు ఎక్కుతున్న క్రమంలో శ్వాస తీసుకోవడం భారమై, అతను ఒక్కసారిగా అదుపుతప్పి పడిపోబోయాడు. దీనికి సంబంధించిన సన్నివేశాలు వైరల్ వీడియోలో క్లారిటీ గా కనిపించాయి. ఆకలి, అలసటతో అతను పడుతున్న ఇబ్బంది చూస్తుంటే నెటిజన్లు కంటతడి పెడుతున్నారు. తీరా అంత కష్టపడి ఇంటికి చేరుకోగా.. లోపల ఉన్న వ్యక్తి కనీసం మంచి నీళ్లు అడగకపోగా, "ఆరామ్‌సే.. జాగ్రత్త" అంటూ కేవలం మాటలతో సరిపెట్టడం విచారకరం.
వైరల్ వీడియో పై మండిపడుతున్న నెటిజన్లు
ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు సదరు అపార్ట్‌మెంట్ వాసులు, సెక్యూరిటీ గార్డు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "బరువైన సామాన్లు మోసే డెలివరీ ఏజెంట్లకు లిఫ్ట్‌లోకి అనుమతి ఇవ్వకపోవడం ఏ రకమైన నిబంధన?" అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆర్డర్ ఇచ్చే కస్టమర్లు కూడా డెలివరీ ఏజెంట్ల పట్ల కనీస సానుభూతితో ఉండాలని, గంటల తరబడి ఎండలో ప్రయాణించి వచ్చే వారికి లిఫ్ట్ సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత అపార్ట్‌మెంట్ అసోసియేషన్లపై ఉందని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియోపై జోమాటో, స్విగ్గీ వంటి సంస్థలు స్పందించి తమ ఏజెంట్లకు రక్షణగా అపార్ట్‌మెంట్లలో లిఫ్ట్ సౌకర్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.






