కిక్కిరిసిన మేడారం ప్రాంగణాలు.. ఎక్కడికక్కడ స్తంభించిన ట్రాఫిక్ జామ్

by Gantepaka Srikanth |

మేడారం మహా జాతర ప్రారంభానికి ముందే భక్తులు పోటెత్తారు.

కిక్కిరిసిన మేడారం ప్రాంగణాలు.. ఎక్కడికక్కడ స్తంభించిన ట్రాఫిక్ జామ్
X

దిశ, వెబ్‌డెస్క్: మేడారం(Medaram) మహా జాతర ప్రారంభానికి ముందే భక్తులు పోటెత్తారు. మేడారం పరిసరాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. సమ్మక్క-సారలమ్మ(Sammakka Saralamma Jatara) దర్శనానికి భారీ క్యూలైన్ ఏర్పడింది. పస్ర-మేడారం, జకారం-మేడారం మధ్య వాహనాల రద్దీతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ములుగు గట్టమ్మతల్లి ఆలయం వద్ద కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు.. ఈసారి రికార్డు స్థాయిలో భక్తులు వస్తారనే అంచనాతో తెలంగాణ ప్రభుత్వం రూ. 150 కోట్లకు పైగా నిధులతో ఏర్పాట్లు చేసింది. గద్దెల ప్రాంగణంలో భక్తుల రద్దీని తట్టుకునేలా క్యూలైన్లను వెడల్పు చేశారు. జంపన్న వాగు వద్ద స్నాన ఘట్టాలను ఆధునీకరించారు. ఆర్టీసీ వేల సంఖ్యలో ప్రత్యేక బస్సులను నడుపుతోంది. అడవిలో తాత్కాలిక వైద్య శిబిరాలు, నిరంతర విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేక గ్రిడ్లను ఏర్పాటు చేశారు. లక్షలాది మంది భక్తులు వచ్చినా ఇబ్బంది కలగకుండా వేల మంది సిబ్బందితో పారిశుధ్య పనులను పర్యవేక్షిస్తున్నారు. మంత్రి సీతక్క, అధికారులు నిత్యం ఏర్పాట్లును పర్యవేక్షిస్తున్నారు.

Next Story