Allu Arjun: ‘పుష్ప-2’ రిలీజ్ డేట్‌ మార్పు.. అధికారిక ప్రకటన విడుదల చేసిన మేకర్స్

by Mallepaka Hamsa |   (  Updated:2024-10-24 15:49:38  IST  )

అల్లు అర్జున్(Allu Arjun), రష్మిక(Rashmika) జంటగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప-2’.

Allu Arjun: ‘పుష్ప-2’ రిలీజ్ డేట్‌ మార్పు.. అధికారిక ప్రకటన విడుదల చేసిన మేకర్స్
X

దిశ, సినిమా: అల్లు అర్జున్(Allu Arjun), రష్మిక(Rashmika) జంటగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప-2’(Pushpa-2). అయితే ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. ఈ సినిమా ‘పుష్ప ది రూల్’ సీక్వెల్‌గా రాబోతుంది. ఇందులో ఫహాద్ ఫాజిల్, అనసూయ(Anasuya Bharadwaj), సునీల్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. దీనిని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కొంత పూర్తి కావడంతో పలు పోస్టర్స్ విడుదలై అంచనాలను పెంచేశాయి. అయితే ఇటీవల మేకర్స్ ‘పుష్ప-2’(Pushpa-2) డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్నట్లు అధికారికంగా వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో.. తాజాగా, పుష్ప-2 (Pushpa-2)నిర్మాతలు నేడు ప్రెస్ మీట్ నిర్వహించి థియేటర్స్‌లో డిసెంబర్ 5న విడుదల కాబోతున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ‘X’ వేదికగా అల్లు అర్జున్ పోస్టర్‌ను విడుదల చేస్తూ ఒక రోజు ముందుగానే సెలబ్రేషన్స్ స్టార్ట్ కాబోతున్నాయని తెలిపారు. అంతేకాకుండా ‘‘వేడుకలు ఒకరోజు ముందుగానే ప్రారంభమవుతాయి. బాక్సాఫీస్ వద్ద బాణాసంచా ముందుగానే పేల్చివేయబడుతుంది. ఒక రోజు ముందే రికార్డుల వేట, పుష్ప రాజ్ పాలన ప్రారంభం కానుంది’’ అనే పవర్ ఫుల్ క్యాప్షన్ జత చేశారు. అయితే ఈ పోస్టర్‌లో అల్లు అర్జున్(Allu Arjun), గన్ పట్టుకుని స్టైలిష్ లుక్‌లో ఉన్నాడు. ప్రజెంట్ మేకర్స్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఈ విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కాగా, పుష్ప-2 డిసెంబర్ 5న విడుదల చేస్తుండగా.. 4వ తేదీన ఓవర్సీస్‌లో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.


👉 Click Here For Twitter Post


Next Story