ట్రేడింగ్ పేరుతో భారీ మోసం.. డైరెక్టర్ తేజ కుమారుడికి రూ.72 లక్షల కుచ్చుటోపీ

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-14 03:30:44  IST  )

ప్రముఖ దర్శకుడు తేజ (Teja) కుమారుడు అమితవ్ తేజ (Amitav Teja) సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నారు.

ట్రేడింగ్ పేరుతో భారీ మోసం.. డైరెక్టర్ తేజ కుమారుడికి రూ.72 లక్షల కుచ్చుటోపీ
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ దర్శకుడు తేజ (Teja) కుమారుడు అమితవ్ తేజ (Amitav Teja) సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నారు. ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో అధిక లాభాలు వస్తాయని నమ్మించిన ఓ దంపతులు, ఆయన నుంచి ఏకంగా రూ.72 లక్షలు వసూలు చేసి మోసానికి పాల్పడ్డారు. పోలీసుల సమాచారం ప్రకారం.. ఓ దంపతులు అమితవ్ తేజను సంప్రదించి, స్టాక్ మార్కెట్ (Stock Market), ఆన్‌లైన్ ట్రేడింగ్‌ (Online Trading)లో పెట్టుబడి పెడితే తక్కువ కాలంలోనే భారీ లాభాలు వస్తాయని నమ్మబలికారు.

అయితే, వారి మాటలను నిజమని నమ్మిన అమితవ్ తేజ పలు దఫాలుగా మొత్తం రూ.72 లక్షలను వారికి బదిలీ చేశారు. డబ్బు తీసుకున్న తర్వాత కొంత కాలం గడిచినా, అటు లాభాలు రాకపోగా.. కనీసం పెట్టిన పెట్టుబడిని కూడా సదరు దంపతులు తిరిగి ఇవ్వలేదు. బాధితుడు వారిని నిలదీయగా, నిందితులు సమాధానం దాటవేస్తూ చివరకు ఫోన్ నంబర్లు మార్చి పరారయ్యారు. తాను మోసపోయానని గ్రహించిన అమితవ్ తేజ వెంటనే పోలీసులను ఆశ్రయించారు. అందిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు ఆ దంపతులపై ఐటీ యాక్ట్, చీటింగ్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.

Next Story