స్టాక్ మార్కెట్ల భారీ పతనం.. కుదేలైన ఇన్వెస్టర్లు

by Malleboina Mahesh |

గత రెండు రోజులుగా భారీ నష్టాలను చవి చూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు మూడో రోజు కూడా భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

స్టాక్ మార్కెట్ల భారీ పతనం.. కుదేలైన ఇన్వెస్టర్లు
X

దిశ. వెబ్ డెస్క్: గత రెండు రోజులుగా భారీ నష్టాలను చవి చూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock markets) మూడో రోజు కూడా భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం నుంచే ప్రతికూల సంకేతాలతో ప్రారంభమైన సూచీలు, అమ్మకాల ఒత్తిడితో మరింత పతనమయ్యాయి. మదుపరుల సెంటిమెంట్ దెబ్బతినడంతో మార్కెట్లలో బేర్ (Bear) ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. కీలక రంగాల షేర్లలో భారీగా అమ్మకాలు వెల్లువెత్తడం మార్కెట్ పతనానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 600 పాయింట్లకు పైగా నష్టపోయి ట్రేడవుతుండగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 200 పాయింట్లకు పైగా పడిపోయింది. బ్యాంకింగ్, ఐటీ, ఆటో రంగాల షేర్లు నష్టాల్లో పయనిస్తుండటంతో సూచీలు కోలుకోలేక పోతున్నాయి. ఈ ఆకస్మిక పతనంతో మదుపరుల సంపద భారీగా ఆవిరైంది. ట్రంప్ టారిఫ్ భయాలు విదేశీ నిధుల ఉపసంహరణ (FII Outflows), జియోపాలిటికల్ టెన్షన్ వాతావరణాలు స్టాక్ మార్కెట్లను నష్టాల్లోకి నెట్టివేస్తున్నట్లు తెలుస్తుంది.

Next Story