రైల్వే పట్టాలపై భారీ పేలుడు.. 12 అడుగుల మేర ధ్వంసమైన ట్రాక్

by Malleboina Mahesh |

రైల్వే పట్టాలపై భారీ పేలుడు సంభవించి.. ట్రాక్ 2 అడుగుల మేర ధ్వంసమైంది. ఈ షాకింగ్ ఘటన శనివారం ఉదయం పంజాబ్‌లోని ఫతేగఢ్ సాహిబ్ జిల్లాలోని సిరిహింద్ వద్ద అమృతసర్-ఢిల్లీ ప్రధాన రైల్వే లైన్‌పై చోటు చేసుకుంది.

రైల్వే పట్టాలపై భారీ పేలుడు.. 12 అడుగుల మేర ధ్వంసమైన ట్రాక్
X

దిశ, వెబ్ డెస్క్: రైల్వే పట్టాలపై భారీ పేలుడు (Huge explosion) సంభవించి.. ట్రాక్ 2 అడుగుల మేర ధ్వంసమైంది. ఈ షాకింగ్ ఘటన శనివారం ఉదయం పంజాబ్‌లోని ఫతేగఢ్ సాహిబ్ జిల్లాలోని సిరిహింద్ వద్ద అమృతసర్-ఢిల్లీ ప్రధాన రైల్వే లైన్‌పై చోటు చేసుకుంది. గణతంత్ర వేడుకలకు ముందు భారీ విద్రోహ కుట్ర వెలుగు చూడటం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. భారీ పేలుడు ధాటికి పట్టాలు సుమారు 12 అడుగుల మేర తునాతునకలయ్యాయి. అదే సమయంలో ఆ మార్గంలో వెళ్తున్న ఒక సరుకు రవాణా రైలు ఇంజన్‌ ఈ పేలుడు దాటికి దెబ్బతినగా, లోకో పైలట్ తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు తీవ్రత ఎంతలా ఉందంటే, కిలోమీటర్ల దూరం వరకు ఆ శబ్దం వినిపించడంతో స్థానికులను భయాందోళనకు గురి చేసింది.

కాగా ఈ పేలుడు సమాచారం అందుకున్న వెంటనే.. ఘటనా స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ బృందాలు అక్కడ హై-గ్రేడ్ పేలుడు పదార్థాలు (RDX) వాడినట్లు ప్రాథమికంగా గుర్తించాయి. రిపబ్లిక్ డే సమీపిస్తున్న తరుణంలో, రైళ్లను లక్ష్యంగా చేసుకుని భారీ ప్రాణనష్టం కలిగించేందుకే ఉగ్రవాదులు, విద్రోహ శక్తులు ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని భద్రతా సంస్థలు అనుమానిస్తున్నాయి. పంజాబ్ పోలీసులు, రైల్వే రక్షణ దళం (RPF) ఉమ్మడిగా దర్యాప్తు చేపట్టి, సరిహద్దు ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించాయి. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా రైల్వే భద్రతను అధికారులు మరోసారి కట్టుదిట్టం చేశారు.

Next Story