- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైలుపై కుప్పకూలిన భారీ క్రేన్.. ఏకంగా 22 మంది దుర్మరణం
నిర్మాణంలో ఉన్న భారీ క్రేన్ ట్రైన్‌పై కూలిన ఘటన థాయిలాండ్ (Thailand)లో చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: నిర్మాణంలో ఉన్న భారీ క్రేన్ ట్రైన్‌పై కూలిన ఘటన థాయిలాండ్ (Thailand)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బ్యాంకాక్ (Bangkok)కు ఈశాన్యంగా 230 కిలో మీటర్ల దూరంలో ఉన్న నఖోన్ రాట్చసిమా (Nakhon Ratchasima) ప్రావిన్స్‌లోని సిఖియో జిల్లాలో బ్యాంకాక్ నుంచి ఉబోన్ రాట్చథానీకి 195 మంది ప్రయాణికులతో వెళ్తున్న రైలుపై.. చైనా సహకారంతో నిర్మిస్తున్న హై-స్పీడ్ రైలు ప్రాజెక్టుకు చెందిన భారీ క్రేన్ అకస్మాత్తుగా కూలింది.
ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు మొత్తం 22 మంది ప్రయాణికులు మృతిచెందగా, మరో 30 మందికిపైగా గాయపడినట్లుగా తెలుస్తోంది. క్రేన్ పడటంతో రైలు బోగీలు పట్టాలు తప్పాయి. ప్రమాదం జరిగిన వెంటనే రైలులో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. బోగీల్లో చిక్కుకున్న ప్రయాణికులను వెలికితీసేందుకు స్థానిక పోలీసులు, రెస్క్యూ టీమ్స్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మృతుల సంఖ్యను నఖోన్ రాట్చసిమా పోలీస్ చీఫ్ ధృవీకరించారు. ఈ ఘోర ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలని థాయ్‌లాండ్ రవాణా మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
READ MORE ....






