చేపల వలలో భారీ బాంబు

by Muthe.Rajitha |

తమిళనాడులోని తిరువళ్లూర్‌ జిల్లా పళవేర్కాడు తీరంలో మంగళవారం సాయంత్రం జాలర్ల వలకు ఒక వింత వస్తువు చిక్కడం తీవ్ర కలకలం రేపింది.

చేపల వలలో భారీ బాంబు
X

దిశ, వెబ్ డెస్క్ : తమిళనాడులోని తిరువళ్లూర్‌ జిల్లా పళవేర్కాడు తీరంలో మంగళవారం సాయంత్రం జాలర్ల వలకు ఒక వింత వస్తువు చిక్కడం తీవ్ర కలకలం రేపింది. పళవేర్కాడు పాసియావరానికి చెందిన దైవప్రకాశం అనే జాలరి మరో నలుగురితో కలిసి పడవలో సముద్రంలో చేపలు పట్టేందుకు వల విసరగా, అందులో సుమారు 10 కిలోల బరువైన, పూర్తిగా తుప్పుపట్టిన ఒక ఇనుపగోళం లాంటి వస్తువు చిక్కుకుంది. అనుమానాస్పదంగా ఉన్న ఆ వస్తువును జాలర్లు సురక్షితంగా ఒడ్డుకు చేర్చి, వెంటనే తిరుప్పాళైవనం పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు బాంబు నిర్వీర్య నిపుణుల (BDDS) బృందంతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని ఆ ఇనుప గోళాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. వారి ప్రాథమిక తనిఖీల్లో అది సముద్రంలో పడిపోయిన ఒక "పేలని బాంబు" (Unexploded Bomb) గా నిర్ధారణ అయింది. అనంతరం దీనిపై మరింత లోతుగా విచారణ జరపగా, గతంలో కోస్టల్‌ గార్డు (తీరరక్షక దళం) సిబ్బంది సముద్ర తీర ప్రాంతంలో జరిపిన రక్షణ రిహార్సల్స్‌ (Mock Drills) లో ఉపయోగించిన బాంబుగా తేలింది. ఈ బాంబును నిపుణులు సురక్షిత ప్రాంతానికి తరలించడంతో జాలర్లు, స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

Next Story