- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెడికల్ కన్వీనర్ కోటాను రక్షించండి
మెడికల్ కన్వీనర్ కోటాను రక్షించాలని ప్రభుత్వానికి హెచ్ఆర్డీఏ విజ్ఞప్తి చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలోని వైద్య విద్యలో దశాబ్దాలుగా కొనసాగుతున్న కన్వీనర్ కోటా వ్యవస్థను యథాతథంగా కొనసాగించాలని, ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాల ఒత్తిళ్లకు తలొగ్గవద్దని హెల్త్‌కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్డీఏ) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు అసోసియేషన్ ప్రతినిధులు మంగళవారం ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్. చోంగ్తూకు వినతిపత్రం సమర్పించారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు యూనిఫాం ఫీజు (అందరికీ ఒకే రకమైన ఫీజు) అనే కొత్త ప్రతిపాదనను తెరపైకి తెస్తూ కన్వీనర్ కోటాను నీరుగార్చాలని చూస్తున్నాయని హెచ్ఆర్డీఏ ఆరోపించింది. ఇది సంస్కరణ కాదని, మెరిట్ ఉన్న పేద, మధ్యతరగతి విద్యార్థులను వైద్య విద్యకు దూరం చేసే కుట్ర అని వారు పేర్కొన్నారు. కన్వీనర్ కోటా లేకపోతే వైద్య విద్య కేవలం సంపన్నులకే పరిమితమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
గత డిసెంబర్ 2న సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సాకుగా చూపుతూ ప్రైవేట్ యాజమాన్యాలు విద్యార్థుల్లో గందరగోళం సృష్టిస్తున్నాయని అసోసియేషన్ తెలిపింది. ఈ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే డివిజన్ బెంచ్‌లో అప్పీలు చేయాలని వారు డిమాండ్ చేశారు. గతంలో ఉన్నత న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులు, రాజ్యాంగ సూత్రాలను విస్మరించి యాజమాన్యాలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. వైద్య విద్య నాణ్యత, అందుబాటు అనేవి భవిష్యత్ ఆరోగ్య వ్యవస్థపై ప్రభావం చూపుతాయని, కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో అత్యవసరంగా స్పందించాలని హెచ్ఆర్డీఏ అధ్యక్షుడు డాక్టర్ కార్తీక్ నాగుల, ఇతర ప్రతినిధులు కోరారు.
- Tags
- HRDA






