- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కర్కాటక రాశి వారికి శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఎలా ఉంటుందంటే..

పునర్వసు 4, హీ, పుష్యమి 1,2,3,4(హు హే,హో,డా) ఆశ్లేష 1,2,3,4 (డీ, డు, డె, డో)
ఆదాయం5,
వ్యయం 5,
రాజ్యపూజ్యం 5
అవమానం 2
ఈ సంవత్సరం గురువు 13.04. 2022 వరకు 8వ స్థానంలో సువర్ణమూర్తిగా ఉండును. తదుపరి వత్సరాంతము వరకు 9వ స్థానంలో రజతమూర్తిగా సంచరించును. శని వత్సరాది నుంచి 7వ స్థానంలో సువర్ణమూర్తిగా 29.04.2022 వరకు ఉండును. తదుపరి 12. 07.2022 వరకు 8వ స్థానమున రజతమూర్తిగా ఉండును. తదుపరి 17.01. 2023 వరకు 7వ స్థానమున సువర్ణమూర్తిగాను, తదుపరి 8వ స్థానమున రజతమూర్తిగాను సంచరించును. ఈ రాశివారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు కనపడుచున్నవి. వృత్తి ఉద్యోగాల పరంగా మంచి ఫలితాలు కనపడుచున్నవి. స్థిరాస్తికి సంబంధించి కలిసొచ్చే అవకాశం ఉండవచ్చు. విద్యా, వృత్తి, ఉద్యోగాల పరంగా అభివృద్ధి కనపడుచున్నవి.
ఆర్థిక విషయాలలో సంతోషకరంగా ఉండవచ్చును. ఉద్యోగ సంబంధిత విషయాల్లోకాస్తా ఒడిదొడుకులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి మంచి పేరు తెచ్చకునే విధంగా నడుచుకుంటారు. కొన్ని సందర్భాల్లో పరిస్థితికి అనుకూలంగా వ్యవహరించడం చాలా శ్రేయస్కరం. కుటుంబ విషయాల్లో చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చును. కొన్ని సమయాల్లో అనసవరమైన ఆలోచనలు చేయడం మానుకోవాలి. బంధువులు, స్నేహితుల విషయాల్లో ముందు జాగ్రత్త వహించడం మంచిది. పోటీ పరీక్షల్లో ఉన్నతంగా ప్రతిభను కనబర్చుతారు. విద్యారంగంలో అనుకూల ఫలితాలు ఉండవచ్చును. స్టేషనరీ వ్యాపారాల వారికి సానుకూల ప్రభావం కనబడుచున్నవి.
స్త్రీలకు గర్భధారణ– సంతాన ప్రాప్తి జరుగవచ్చును. ఆహార ధాన్యాలు, నీటి వ్యాపారులు ఆర్థికంగా ఎక్కువ లాభాలు పొందవచ్చను. వివాహ సంబంధాలు సానుకూలమైన ఫలితాలు ఇవ్వవచ్చును. బంధువర్గాలలో వారికి మీకు చేతనైన సహాయం చేస్తారు. అతి ఆత్మ విశ్వాసం మంచిది కాదు. విదేశ విద్యను అభ్యసాఇంచాలనే వారి కోరిక కొంత కాలానికి సఫలమవుతుంది. కుటుంబ కలహాలు జరిగే అవకాశం ఉన్నది. కాస్త మానసిక ప్రశాంతతకు భంగం కలుగ వచ్చును. ఆధిపత్యపోరు అధికం కావచ్చును. ఓర్పుగా వ్యవహరించడం ఉత్తమం. తమను అభిమానించే వారి మనసును గాయపర్చడం, పొరుగు వారిని దగ్గరకు తీయుట పరిపాటిగా మారవచ్చును.
వృత్తి ఉద్యోగాల్లో కొంత మానసిక ఆందోళన ఉన్నప్పటికీ సానుకూల స్వభావంతో అధిగమించుతారు. క్రీడా రంగాల్లో మంచి ప్రతిభ కనబర్చవచ్చును. ఎందుటి వారిని అతిగా నమ్మడం మంచిది కాకపోవచ్చు. వివాహాది శుభకార్యాలలో కొంత జాప్యం జరుగవచ్చు. విదేశీ ప్రయాణాలకు అనుకూలంగా ఉండవచ్చును. నూతన ఉద్యోగావకాశాలు వృత్తిపరంగా సానుకూల సూచనలున్నాయి. అవినీతిపరమైన వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిదని నిర్ణయించుకుంటారు. వ్యాపార సంస్థలకు, పరిశ్రమలకు సానుకూలంగా ఉండవచ్చు. అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా పుంజుకోవచ్చును. జీవిత భాగస్వమితో మంచి ప్రవర్తన, ఆభరణాల కొనుగోలు చేయడం వంటి శుభసూచనలున్నవి.
సంతానం కోసం చూసే వారికి మంచి సత్సంతానం కలుగవచ్చును. బంధువర్గ విషయాలలో మీరు మనేర్పుగా ఉంటూ సహాయం కోరిన వారికి మేలు చేసే అవకాశౄలు కనబడుచున్నవి. సామాజిక పరమైన గొడవలు, మార్పులకు దూరంగా ఉండటం మంచిది. కొన్ని న్యాయపరమైన చిక్కుల నుంచి బయటపడవచ్చును. శుభకార్యాచరణ దిశగా అడుగులు వేస్తారు. స్నేహాలు ఇబ్బందికరంగా మారవచ్చును. వాక్కఠిన్యం పెరుగవచ్చును. తగు నియంత్రణ అవసరం. స్నేహితులు, ఆత్మీయులు పరిపూర్ణ అనురాగ ఆత్మీయతలు పొందుతారు. పరస్పర సహకారం ఏర్పడుతుంది. ప్రభుత్వ పరంగా లబ్ధి పొందుతారు.
- Tags
- ugadi






