Today's Horoscope:ఈరోజు(26-06-2026) రాశి ఫలాలు.. 12 రాశుల వారికి ఎలా ఉందంటే?

by Jakkula.Mamatha |

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈరోజు 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకోండి.

Todays Horoscope:ఈరోజు(26-06-2026) రాశి ఫలాలు.. 12 రాశుల వారికి ఎలా ఉందంటే?
X

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈరోజు(శుక్రవారం) 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకోండి.

మేష రాశి

ఈ రాశి వారికి ఇవాళ బాగుంటుంది. కార్యాలయంలో మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. అనుకోని వనరుల నుంచి ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది.

వృషభ రాశి

ఈ రాశి వారికి ఇవాళ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన రోజు. ఉద్యోగస్తులకు కాస్త పని ఒత్తిడి పెరగవచ్చు. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం మంచిది. జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోండి.

మిథున రాశి

మీ సృజనాత్మకతకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా పురోగతి ఉంటుంది, పాత బాకీలు వసూలవుతాయి. మిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

కర్కాటక రాశి

ఈరాశి వారు ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం గా చెప్పవచ్చు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది, కాబట్టి బడ్జెట్ ప్రకారం నడుచుకోండి. ఉద్యోగంలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రయాణాల వల్ల కాస్త అలసటగా అనిపించవచ్చు. ధ్యానం లేదా విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వండి.

సింహ రాశి

ఈ రాశి వారికి ఇవాళ అనుకూల ఫలితాలు ఉన్నాయి. పట్టిన పట్టు వదలకుండా అనుకున్న పనులు పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆదాయం బాగుంటుంది. కుటుంబంలో శుభకార్యాల గురించిన చర్చలు జరుగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

కన్య రాశి

మీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి మంచి అవకాశం లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు సామాన్యంగా ఉంటాయి. పెద్దల సలహాలు తీసుకోవడం వల్ల కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం బాగుంటుంది.

తుల రాశి

శుక్రవారం మీకు అదృష్టం కలిసి వచ్చే రోజు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. నూతన పరిచయాలు వ్యాపారానికి లబ్ధి చేకూరుస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మనశ్శాంతి లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు.

వృశ్చిక రాశి

ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ఇష్టదైవారాధన మేలు చేస్తుంది.

ధనస్సు రాశి

భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగంలో మీ శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. సాయంత్రం వేళ ఆనందంగా గడుస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది.

మకర రాశి

కోర్టు వ్యవహారాలు లేదా పాత వివాదాలు మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. శత్రువులపై విజయం సాధిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి, ముఖ్యంగా ఆహార నియమాలు పాటించండి. ధ్యానం చేయండి. దేవాలయాలకు వెళ్లడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.

కుంభ రాశి

విద్యార్థులకు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి అనుకూలమైన సమయం. కొత్త పనులకు శ్రీకారం చుట్టడానికి ఈరోజు శుభప్రదం. సంతాన పరమైన శుభవార్తలు వింటారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

మీన రాశి

ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయాలనే మీ ఆలోచనలు ముందుకు సాగుతాయి. అయితే, కార్యాలయంలో సహోద్యోగులతో చిన్నపాటి విభేదాలు రావచ్చు. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఒత్తిడికి లోనవకుండా ప్రశాంతంగా ఉండండి.

Next Story