- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలయ్య–కొరటాల ప్రాజెక్ట్‌కు భారీ బడ్జెట్ కేటాయించిన మేకర్స్
'NBK112'ను రూ.150–200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించేందుకు మేకర్స్ సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది.

దిశ, వెబ్ డెస్క్: నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందనున్న సినిమా పూజా కార్యక్రమాలు నిన్న ఘనంగా జరిగాయి. చిత్రానికి ఇంకా అధికారిక టైటిల్ ప్రకటించకపోవడంతో NBK112 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, సినిమా షూటింగ్‌ను ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. దీంతో అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమా బడ్జెట్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని రూ.150 నుంచి రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించేందుకు మేకర్స్ సిద్ధమైనట్లు సమాచారం. అవసరమైతే బడ్జెట్ మరింత పెరిగినా వెనుకాడకూడదనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఎస్‌ఎల్‌వీ సినిమాస్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.






