- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీగా పతనమైన ముడిచమురు ధరలు.. 4 నెలల కనిష్టానికి ‘బ్రెంట్ క్రూడ్’
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు నాలుగు నెలల కనిష్టానికి పడిపోయాయి.

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు (Crude Oil) ధరలు భారీగా పతనమయ్యాయి. గత 4 నెలల కాలంలో ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి చమురు ధరలు పడిపోయాయి. ఫిబ్రవరిలో పశ్చిమాసియాలో(Middle East)లో మొదలైన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా చమురు ధరలపై పెరిగిన ‘రిస్క్ ప్రీమియం’ ప్రభావం ప్రస్తుతం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. భారత్ లాంటి భారీగా చమురు దిగుమతి చేసుకునే దేశాలకు ఇది పెద్ద ఊరటనిచ్చే అంశమని బిజినెస్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.
మార్చి పీక్స్ నుంచి ఒక్కసారిగా డౌన్..
తాజా సమాచారం ప్రకారం.. గ్లోబల్ బెంచ్‌మార్క్ అయిన బ్రెంట్ క్రూడ్ (Brent Crude) ధర బ్యారెల్‌కు ప్రస్తుతం 75.07 నుండి 71.79 డాలర్ల సమీపంలో ట్రేడవుతోంది. అదేవిధంగా, యుఎస్ బెంచ్‌మార్క్ అయిన వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ ధర కూడా బ్యారెల్‌కు 70 నుంచి 71 డాలర్ల వద్దకు పడిపోయింది. గత మార్చి నెలలో యుద్ధ వాతావరణం, ఉద్రిక్తతల కారణంగా బ్రెంట్ క్రూడ్ ధర ఏకంగా 119 డాలర్ల గరిష్ట స్థాయికి చేరువైన సంగతి తెలిసిందే. ఆ గరిష్ట ధరలతో పోలిస్తే ప్రస్తుత ధరలు భారీగా తగ్గాయి. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ద్వారా ముడిచమురు ట్యాంకర్ల రాకపోకలు సాధారణ స్థితికి రావడం, ఇరాన్-అమెరికా మధ్య శాంతి ఒప్పంద కుదరడం ధరలు పడిపోవడానికి ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.






