- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్యాస్ సిలిండర్ లీక్.. ఇల్లు దగ్ధం..
దిశ, శాయంపేట: హన్మకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో..House burnt at Shayampet

X
దిశ, శాయంపేట: హన్మకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో గ్యాస్ సిలిండర్ లీకై అగ్నిప్రమాదం సంభవించింది. మండల కేంద్రానికి చెందిన ఆరీకే భారతి అనే మహిళ ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్ కావడంతో మంటలు వ్యాపించి ఇంట్లో ఉన్న సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది. ఘటన జరిగిన సమయంలో మహిళ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేశారు. ఇల్లు, ఇంట్లోని సామాగ్రి పూర్తిగా దగ్ధమైనట్లు బాధితురాలు తెలిపింది. సుమారు రూ. 2 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు మండల రెవెన్యూ ఇన్ స్పెక్టర్ అంచనా వేశారు.
Next Story






