- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిర్యానీ లవర్స్‌కు బిగ్ షాక్.. రేపు నగరం మొత్తం హోటల్స్ బంద్: అసోసియేషన్ సంచలన నిర్ణయం
గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిపివేతతో బెంగళూరులో రేపు హోటళ్లు బంద్. సామాన్యులకు భోజన కష్టాలు తప్పవు. కేంద్రం స్పందించాలని అసోసియేషన్ విజ్ఞప్తి.

దిశ, వెబ్ డెస్క్: రేపటి నుంచి బెంగళూరులో హోటళ్లు పూర్తిగా బంద్ చేస్తున్నట్లు బెంగళూరు హోటల్ అసోసియేషన్ (Bangalore Hotel Association) సంచలన నిర్ణయం ప్రకటించింది. బెంగళూరులో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల (Commercial gas cylinders) సరఫరా అకస్మాత్తుగా నిలిచిపోవడంతో హోటల్ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో పడింది. ఈ నేపథ్యంలో బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ కీలక ప్రకటన చేస్తూ, గ్యాస్ కొరత కారణంగా రేపు నగరంలోని హోటళ్లను మూసివేస్తున్నట్లు వెల్లడించింది. చమురు సంస్థలు గతంలో 70 రోజుల వరకు సరఫరాకు ఎటువంటి అంతరాయం ఉండదని హామీ ఇచ్చినప్పటికీ, ఇప్పుడు అకస్మాత్తుగా సరఫరా ఆపేయడం తమ పరిశ్రమకు కోలుకోలేని దెబ్బ అని అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. గ్యాస్ సరఫరా సాధారణ స్థితికి వచ్చే వరకు హోటళ్లను నిర్వహించడం అసాధ్యమని వారు స్పష్టం చేశారు.
హోటల్ పరిశ్రమను 'అత్యవసర సేవ' (Essential Service)గా పరిగణించాలని, ఈ మూసివేత వల్ల ప్రతిరోజూ హోటళ్లపై ఆధారపడే సామాన్యులు, విద్యార్థులు, వృద్ధులు, రోగులు భోజనం దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సమస్యపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి, కమర్షియల్ గ్యాస్ సరఫరాను పునరుద్ధరించాలని వారు విజ్ఞప్తి చేశారు. గ్యాస్ నిల్వలు నిలిచిపోవడంతో హోటల్ యజమానులు గత్యంతరం లేని స్థితిలో ఈ బంద్ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తుంది.






