- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డబ్బుల్లేవని సీనియర్ నటిని చేర్చుకోని ఆసుపత్రి డాక్టర్లు.. అర్ధరాత్రి ఫుట్‌పాత్‌పై వదిలేసిన క్యాబ్ డ్రైవర్
సీనియర్ నటి పావలా శ్యామలకు డబ్బుల్లేవని కూకట్‌పల్లి ఆస్పత్రి చికిత్స నిరాకరించింది. క్యాబ్ డ్రైవర్ ఆమెను ఫుట్‌పాత్‌పై వదిలేయగా పోలీసులు రక్షించారు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో వందలాది చిత్రాల్లో నటించి ప్రేక్షకులను నవ్వించిన సీనియర్ నటి పావలా శ్యామల (Pavala Shyamala) జీవితం అత్యంత దయనీయ స్థితికి చేరుకుంది. గత కొంత కాలంగా వృద్దాప్యం, తీవ్రమైన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆమె శుక్రవారం రాత్రి అత్యవసర చికిత్స నిమిత్తం హైదరాబాద్ కూకట్‌పల్లిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. అయితే, ఆమె వద్ద చికిత్సకు సరిపడా డబ్బులు లేవనే కారణంతో ఆసుపత్రి యాజమాన్యం ఆమెను చేర్చుకోవడానికి నిరాకరించింది. అంతటితో ఆగకుండా కనీస మానవత్వం లేకుండా ఆమె కోసం ఒక ప్రైవేట్ క్యాబ్‌ను బుక్ చేసి అక్కడి నుండి పంపించివేసింది. ఆసుపత్రి చేసిన అన్యాయం చాలదన్నట్టు.. సదరు క్యాబ్ డ్రైవర్ కూడా అర్ధరాత్రి సమయంలో అమానుషంగా ప్రవర్తించి, ఆమెను ఓ జంక్షన్ వద్ద ఫుట్‌పాత్‌పైనే ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయాడు.
అర్ధరాత్రి వేళ నడిరోడ్డుపై దిక్కుతోచని అయోమయ స్థితిలో ఉన్న వృద్ధురాలైన పావలా శ్యామలను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను రక్షించి, సురక్షితంగా 'ఆర్కే ఫౌండేషన్ కు తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో నటించిన నటి, ఈరోజు వైద్యం అందక నడిరోడ్డుపై పడి ఉండటం చూసి అభిమానులు కన్నీరుమున్నీరవుతున్నారు. 'మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్' (MAA), చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు వెంటనే స్పందించి ఆమెకు మెరుగైన వైద్య సహాయం అందించి ఆదుకోవాలని ఈ వార్తపై స్పందించిన నెటిజన్లు విజ్ఞప్తి చేస్తున్నారు.






