నేడే బక్రీద్.. తెలుగు రాష్ట్రాల్లో సెలవు

by Muthe.Rajitha |

త్యాగానికి ప్రతీకగా నిలిచే పవిత్ర 'ఈద్-ఉల్-అజా' (బక్రీద్) పండుగను ఈరోజు దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు.

నేడే బక్రీద్.. తెలుగు రాష్ట్రాల్లో సెలవు
X

దిశ, వెబ్ డెస్క్ : త్యాగానికి, భక్తికి ప్రతీకగా నిలిచే పవిత్ర 'ఈద్-ఉల్-అజా' (బక్రీద్) పండుగను ఈరోజు దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు ఎంతో భక్తిశ్రద్ధలతో, ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రవక్త ఇబ్రహీం చేసిన గొప్ప త్యాగాన్ని స్మరించుకుంటూ ఈ పండుగ రోజున ప్రత్యేక ప్రార్థనలు, ఖుర్బానీలు సమర్పిస్తున్నారు. తెలంగాణ, ఏపీలో నేడు గెజిటెడ్ హాలిడేగా నిర్ణయించడంతో.. ఇరు రాష్ట్రాల్లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలతో పాటు బ్యాంకులు కూడా ఈరోజు మూతపడ్డాయి. అయితే తొలుత ఇరు రాష్ట్రాలు 27న సెలవు ప్రకటించగా.. నెలవంక ఒకరోజు ఆలస్యంగా దర్శనం ఇవ్వడంతో ముస్లిం పెద్దలు పండగను 28కి మార్చారు. దీంతో ఇటు తెలంగాణ, అటు ఏపీ ప్రభుత్వాలు కూడా సెలవును ఒకరోజు వెనక్కి జరిపి గురువారానికి సెలవును డిక్లేర్ చేసాయి. ఇక పండగ నేపథ్యంలో ఇరు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముస్లిం ప్రజలకు పండగ శుభాకాంక్షలు తెలియజేసారు.

Next Story