- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హోలీ వేడుకల్లో అపశృతి.. ఇద్దరు యువకుల గల్లంతు
by Bhoopathi Nagaiah |
నిర్మల్ జిల్లాలో హోలీ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. శుక్రవారం సాయంత్రం సంబరాలు ముగించుకుని

X
దిశ,నిర్మల్ కల్చరల్: నిర్మల్ జిల్లాలో హోలీ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. శుక్రవారం సాయంత్రం సంబరాలు ముగించుకుని సోన్ గోదావరి నదికి వెళ్లిన 8 మంది యువకుల్లో ఒకరు గల్లంతయ్యారు. అదేవిధంగా సిద్దాపూర్ స్వర్ణవాగులో స్నానానికి వెళ్లిన నలుగురు యువకుల్లో మరోకరు గల్లంతైనట్లు పోలీసులు వెల్లడించారు. సోన్ మండల కేంద్రంలోని వెంకటేశ్వరస్వామి ఆలయ తీరంలోని గోదావరినదిలో రాంపెల్లి సాయిరాం(26) , సిద్దాపూర్ స్వర్ణవాగు తీరంలో మరో యువకుడు సాయితేజ(25) గల్లంతైనట్లు పోలీసులు వెల్లడించారు. ఉదయం నుంచి హోలీ సంబురాల్లో పాల్గొన్న యువకులు సాయంత్రం స్నానానికి వెళ్లి గల్లంతు కావడం ఆయా ప్రాంతాల్లో తీవ్రవిషాదాన్ని నింపింది. గల్లంతైన యువకుల కోసం పోలీసులు, కుటుంబీకులు గాలింపు చర్యలు చేపట్టారు .
Next Story






