- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరుసగా రెండోసారి.. అస్సాం సీఎంగా హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకారం
హిమంత బిశ్వ శర్మ అస్సాం ముఖ్యమంత్రిగా మరోసారి బాధ్యతలు చేపట్టారు. ప్రధాని మోడీ, ఎన్డీయే ముఖ్యమంత్రుల సమక్షంలో జరిగిన ఈ వేడుక అస్సాం రాజకీయాల్లో పట్టును చాటింది.

దిశ, వెబ్ డెస్క్: హిమంత బిశ్వ శర్మ (Himanta Biswa Sharma) ప్రమాణ స్వీకారంతో అస్సాం రాజకీయాల్లో చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. గౌహతిలోని ఖానాపరాలో నేడు (మే 12, 2026) జరిగిన అట్టహాసమైన వేడుకలో హిమంత బిశ్వ శర్మ అస్సాం ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం (Oath taking) చేశారు. గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆయనతో ప్రమాణం చేయించారు. బిశ్వ శర్మ తో పాటు రామేశ్వర్ తేలి, అతుల్ బోరా (AGP), చరణ్ బోరో (BPF), అజంతా నియోగ్ వంటి కీలక నేతలు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. సీనియర్ నేత రంజిత్ దాస్‌ను అసెంబ్లీ స్పీకర్ అభ్యర్థిగా ఎంపిక చేశారు.
ఈ కార్యక్రమం దేశంలోని అగ్రనేతల సమక్షంలో అత్యంత వైభవంగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi), కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్ (యూపీ), నారా చంద్రబాబు నాయుడు (ఏపీ), నెయిఫియు రియో (నాగాలాండ్) సహా ఎన్డీయే కూటమికి చెందిన ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు ఈ వేడుకలో పాల్గొని హిమంత బిశ్వ శర్మకు అభినందనలు తెలిపారు. 126 స్థానాలున్న అస్సాం అసెంబ్లీలో ఎన్డీయే కూటమి 102 స్థానాల భారీ మెజారిటీతో విజయం సాధించిన నేపథ్యంలో, ఈ విజయోత్సవ సభ అస్సాం అభివృద్ధిలో కొత్త శకానికి నాంది పలికిందని నేతలు కొనియాడారు.






