ఎలన్ తండ్రి వీర్యానికి భారీ డిమాండ్.. హై క్లాస్ మహిళలకు ఉచితం!

by Disha Web Desk 12 |
ఎలన్ తండ్రి వీర్యానికి భారీ డిమాండ్.. హై క్లాస్ మహిళలకు ఉచితం!
X

దిశ, ఫీచర్స్ : టెస్లా, స్పేస్‌ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ తండ్రి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ రివీల్ చేశాడు. దక్షిణ అమెరికాలోని అనేక మంది మహిళలు స్పెర్మ్‌ దానం చేయాల్సిందిగా తనను కోరినట్లు 76 ఏళ్ల ఎర్రోల్ మస్క్ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. కొలంబియాలోని ఒక పేరులేని కంపెనీ తన స్పెర్మ్‌ను దానం చేసే అవకాశాన్ని అందించిందని, ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలన్ మస్క్‌ పుట్టుకకు కారణమైన మేధావి జన్యువులు అందులో ఉన్నాయని అతను చెప్పాడు.

ఈ ఆఫర్ గురించి వివరించిన ఎర్రోల్.. హై-క్లాస్ మహిళలు గర్భం దాల్చేందుకు తన స్పెర్మ్‌ను దానం చేయాల్సిందిగా ఓ కంపెనీ తనను సంప్రదించినట్లు తెలిపాడు. అంతేకాదు ఎలన్‌‌ను పుట్టించిన అసలు వ్యక్తిని నేను ఉండగా.. ఎలన్‌ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఏముందని సదరు కంపెనీ తనతో వ్యాఖ్యానించినట్లు ఎర్రోల్ రివీల్ చేశాడు. అయితే వీర్యం కోసం కొలంబియన్ కంపెనీ తనకు ఎటువంటి డబ్బును అందించలేదని, కానీ ఫస్ట్-క్లాస్ ప్రయాణం, ఫైవ్-స్టార్ హోటల్‌లో వసతితో పాటు ఇతరత్రా అనేక రకాల వస్తువులు, సౌకర్యాలను అందించారని చెప్పుకొచ్చాడు.

ఎరోల్ ఇప్పటివరకు ముగ్గురు వేర్వేరు మహిళలతో కలిసి కనీసం ఏడుగురు పిల్లలకు తండ్రి అయ్యాడు. మొదటి భార్య మాయె మస్క్‌తో ముగ్గురు 'ఎలోన్, కింబాల్(49), టోస్కా(47)'లకు జన్మనిచ్చాడు. ఆ తర్వాత ఎరోల్ హీడ్‌ను వివాహం చేసుకోగా.. రోజ్, అలెగ్జాండ్రా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇక హీడ్ మొదటి భర్త కూతురు జెనాతో కూడా తాజాగా ఓ బిడ్డకు జన్మనిచ్చిన ఎరోల్ తన సామర్థ్యంపై పూర్తి నమ్మకంతో ఉన్నాడు.

Next Story

Most Viewed