- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సర్టిఫికెట్లు ఇవ్వకపోతే కాలేజీలపై కఠిన చర్యలు.. హైకోర్టు సంచలన ఆదేశాలు
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల సాకుతో విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను నిలిపివేస్తున్న ప్రైవేటు కాలేజీల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: ఫీజు రీయింబర్స్‌మెంట్ (Fee Reimbursement) బకాయిల సాకుతో విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను నిలిపివేస్తున్న ప్రైవేటు కాలేజీల తీరుపై హైకోర్టు (Telangana High Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫీజులు రాలేదన్న కారణంతో విద్యార్థులను వేధించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేస్తూ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫీజు చెల్లించని కారణంగా సర్టిఫికెట్లు ఇవ్వని కాలేజీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హైకోర్టులో పలు విద్యార్థి సంఘాలు పిటిషన్ దాఖలు చేశాయి. ఈ మేరకు వారి పిటిషన్లపై విచారణ చేపట్టిన కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
అసలు సర్కారు నుంచి రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఎన్ని..? వాటిని ఎప్పుడు చెల్లిస్తారు అనే అంశాలపై రెండు వారాల్లో పూర్తి వివరణ ఇవ్వాలని హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ (Chief Justice Aparesh Kumar Singh) ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించారు. అదేవిధంగా ఫీజు బకాయిల కోసం విద్యార్థుల సర్టిఫికెట్లను తాకట్టు పెట్టుకునే హక్కు ఏ విద్యా సంస్థకూ లేదని కోర్టు తేల్చి చెప్పింది. సర్టిఫికెట్లు ఆపడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు, ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటున్నాయని కోర్టు కామెంట్ చేసింది. కాలేజీల వేధింపులకు గురవుతున్న విద్యార్థులు తమ ఫిర్యాదులను చెప్పుకునేందుకు, తక్షణ పరిష్కారం కోసం ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభత్వం తరఫు లాయర్‌కు సూచించారు.






