Beast: మీడియాకు అందుకే దూరంగా ఉంటున్న.. స్టార్ హీరో క్లారిటీ

by Dishanational2 |
Beast: మీడియాకు అందుకే దూరంగా ఉంటున్న.. స్టార్ హీరో క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుస హిట్‌లతో ప్రస్తుతం మాంచి జోష్‌లో ఉన్నారు విజయ్. తాజాగా.. ఆయన నటించిన కొత్త చిత్రం బీస్ట్ ఈనెల 13న విడుదల కానుంది. ఈ చిత్రం కోసం ఆయన అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నది. ఈ చిత్రనికి అనిరుద్ పాటలు అదించాడు. కళానిధి మారన్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే, బీస్ట్ సినిమా ప్రమోషన్స్, ప్రెస్‌మీట్స్‌లలో విజయ్ కనిపించడంతో అందరు షాక్ అవుతున్నారు.

ఇటీవల నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో 'బీస్ట్' దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్‌తో కలిసి విజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్‌ మాట్లాడుతూ.. తాను మీడియాకు ఎందుకు దూరంగా ఉంటాడో స్పష్టం చేశారు. చాలా ఏళ్ల క్రితం తనకు జరిగిన ఓ సంఘటనతో తాను మీడియాకు దూరమయ్యానని చెప్పుకొచ్చారు. ఓ ఇంటర్వ్యూలో తాను ఒకటి మాట్లాడితే ఆ మీడియా వాళ్లు మరొకటి రాశారు. మరుసటి రోజు పత్రికల్లో వచ్చిన వార్తలు చూసి మనస్సుకు ఎంతో బాధ కలిగింది. అని విజయ్ చెప్పాడు. ఆ వార్తను చూసిన తన స్నేహితులు సైతం షాక్ అయ్యారని విజయ్ తెలిపారు. ఆ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయనీ చెప్పుకొచ్చాడు. అయితే తన ఇంట్లో వాళ్లకు మాత్రం వాస్తవాలేంటో తెలుసు కానీ, బయటి వాళ్లందరికీ తెలియదు. ఈ కారణంగా అప్పటి నుంచి తాను మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు విజయ్‌ స్పష్టం చేశారు.


Next Story

Most Viewed