పాటలు కూడా వినిపించగలిగే సరికొత్త సన్ గ్లాసె‌స్

by Harish |

దిశ, వెబ్‌డెస్క్: హీరో గ్రూప్‌కు చెందిన టెక్నాలజీ కంపెనీ హీరో ఎలక్ట్రానిక్స్..telugu latest news

పాటలు కూడా వినిపించగలిగే సరికొత్త సన్ గ్లాసె‌స్
X

దిశ, వెబ్‌డెస్క్: టెక్నాలజీ కంపెనీ హీరో ఎలక్ట్రానిక్స్ కొత్తగా అధునాతన క్యూబో గో ఆడియో సన్‌గ్లాసెస్‌‌ను విడుదల చేసింది. కొత్త ఆడియో సన్‌ గ్లాసెస్ క్లాసిక్ వేఫేరర్ ఆకారంలో క్లాసిక్ బ్లాక్, కూల్ బ్లూ, షిమ్మర్ ఎల్లో, క్లాసిక్ గ్రీన్, నారింజ అనే ఐదు కలర్స్‌లలో లభిస్తుంది. దీని ధర రూ. 5,990.

"ఈ సన్ గ్లాసెస్‌లోని Qualcomm aptX HD ఆడియో ,చెవులకు ఇబ్బంది లేకుండా సంగీతాన్ని వినడానికి ఉపయోగపడుతుంది. హ్యాండ్స్-ఫ్రీగా కాల్‌లు చేయడానికి, బైక్ నడుపుతున్నా, ఎండలో డ్రైవింగ్ చేసిన, ఆడియో డైరెక్షన్ సూచనలు నావిగేట్ చేయడంలో సహాయపడతాయని" కంపెనీ తెలిపింది. అలాగే Siri, Google అసిస్టెంట్‌‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ బ్లూటూత్ సన్ గ్లాసెస్‌‌లో UV లెన్స్‌లు, డైరెక్షనల్ ఓపెన్ ఇయర్ స్పీకర్‌లు, కొత్త ఇన్‌బిల్ట్ మైక్రోఫోన్‌‌ను అమర్చారు. గరిష్టంగా 6 గంటల ప్లేటైమ్‌తో, ఈ సన్‌గ్లాసెస్‌ను రన్నింగ్, సైక్లింగ్, స్కేటింగ్, బైక్ రైడింగ్, యోగా, షాపింగ్ వంటి అనేక రకాల కార్యకలాపాల కోసం ఉపయోగించవచ్చు.

Next Story