ట్రాఫిక్‌లో చిక్కుకున్న సంక్రాంతి ప్రయాణికులు

by Gantepaka Srikanth |

హైదరాబాద్ - విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

ట్రాఫిక్‌లో చిక్కుకున్న సంక్రాంతి ప్రయాణికులు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ - విజయవాడ హైవే(Hyderabad-Vijayawada Highway)పై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మంగళవారం ఉదయం అబ్దుల్లాపూర్‌మెట్ సమీపంలో కర్రలతో వెళ్తోన్న లారీ బోల్తా పడింది. దీంతో విజయవాడ హైవేపై కర్రలన్నీ చెల్లచెదురుగా పడిపోయాయి. విషయం తెలిసిన వెంటనే పోలీసులు స్పాట్‌కు వెళ్లారు. మూడు జేసీబీలు, రెండు క్రేన్ల సాయంతో రోడ్ల మీదున్న కర్రలు తొలగిస్తున్నారు. లారీ బోల్తా కారణంగా హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సంక్రాంతికి ఊరికి బయల్దేరిన ప్రయాణికులు అందరూ ట్రాఫిక్‌లో చిక్కుకుని పోయారు. ఇదిలా ఉంటే.. పండగకు ఏపీ వైపు వెళ్లే వాహనాలతో పలుచోట్ల ట్రాఫిక్‌జామ్‌ ఏర్పడుతోంది. పంతంగి టోల్‌ప్లాజా వద్ద కార్లు, ఇతర వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. విజయవాడ వైపు వెళ్లే వాహనాల కోసం 10 టోల్‌ బూత్‌లను అధికారులు తెరిచారు. పెదకాపర్తి, చిట్యాల, కోదాడ, రామాపురం క్రాస్‌ వద్ద వాహనాలు నెమ్మదిగా వెళ్తున్నాయి. హైవేపై బ్లాక్‌ స్పాట్ల వద్ద పోలీస్‌ పికెట్‌ కొనసాగుతోంది.

Next Story