- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్రీనగర్‌లో భారీగా హిమపాతం.. విమాన రాకపోకలకు అంతరాయం
గతంలో ఎన్నడూ లేని విధంగా జమ్మూ కాశ్మీర్‌లో భారీ హిమపాతం చోటుచేసుకుంటుంది. దీంతో ఎక్కడ చూసిన మంచు దుప్పట్లో కొండలు, సరస్సులు, నగరాలు కమ్ముకుని ఉన్నాయి.

దిశ, వెబ్ డెస్క్: గతంలో ఎన్నడూ లేని విధంగా జమ్మూ కాశ్మీర్ (Jammu and Kashmir)లో భారీ హిమపాతం (Heavy snowfall) చోటుచేసుకుంటుంది. దీంతో ఎక్కడ చూసిన మంచు దుప్పట్లో కొండలు, సరస్సులు, నగరాలు కమ్ముకుని ఉన్నాయి. ఈ క్రమంలో శ్రీనగర్ విమానాశ్రయం పరిధిలో తెల్లవారుజాము నుంచి మరోసారి తేలికపాటి మంచు కురుస్తుండటంతో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రన్‌వే, విమాన రాకపోకలు సాగించే ఇతర ప్రాంతాల్లో (Airside pavements) మంచు పేరుకుపోవడంతో కార్యకలాపాలు నిలిచిపోయాయి. ప్రస్తుతం బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) బృందాలు రన్‌వేను శుభ్రం చేసే పనిలో నిమగ్నమై ఉన్నాయి. విమాన కార్యకలాపాలకు (Flight operations) అనువైన పరిస్థితులు కల్పించేందుకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన మంచును తొలగిస్తున్నారు.
ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా విమానాలు ఆలస్యమయ్యే అవకాశం ఉందని విమానాశ్రయ అధికారులు (Airport officials) ప్రయాణికులను హెచ్చరించారు. గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన ప్రయాణికులు తమ విమాన సమయాల గురించి ఆయా విమానయాన సంస్థలను సంప్రదించి, తాజా సమాచారం తెలుసుకోవాలని శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్ అధికారులు సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. వాతావరణం అనుకూలించిన తర్వాతే విమాన సర్వీసులు సాధారణ స్థితికి చేరుకుంటాయని వారు స్పష్టం చేశారు.






