- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్ డెస్క్ : అమెరికాను భారీ మంచు తుఫాను కుదిపేస్తోంది. మంచు తుఫాను ప్రభావంతో దేశవ్యాప్తంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. వింటర్ స్టార్మ్ కారణంగా మధ్య, తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో భారీగా మంచుకురుస్తూ.. ఐస్ పేరుకుపోవడంతో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. గత రెండు రోజుల్లో 13,000కుపైగా విమానాలు రద్దయ్యాయి. హ్యూస్టన్, షికాగో, అట్లాంటా, డల్లాస్ వంటి ప్రధాన విమానాశ్రయాల్లో విమాన రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. విద్యుత్ లైన్లు తెగిపోవడంతో టెక్సాస్, లూయిసియానా, టెన్నెసీ, ఇల్లినాయిస్, ఒహియో వంటి రాష్ట్రాల్లో 1.20 లక్షలకు పైగా ఇళ్లు, వ్యాపారాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
దాదాపు 14 కోట్ల మంది ప్రజలు ఈ తుఫాను ప్రభావానికి గురయ్యారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది అమెరికా జనాభాలో సగానికి కంటే ఎక్కువే కావడం గమనార్హం. దాదాపు 22 రాష్ట్రాలు ఎమర్జెన్సీ ప్రకటించాయి. మరోవైపు నిత్యావసరాల కోసం ప్రజలు సూపర్‌మార్కెట్లకు పరుగులు తీయడంతో బ్రెడ్, పాలు, బ్యాటరీలు, ఇంధనం వంటి వస్తువుల తీవ్ర కొరత ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో 8 నుంచి 13 అంగుళాల వరకు మంచు కురవగా, ఉష్ణోగ్రతలు మైనస్ స్థాయికి పడిపోయాయి.
ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని నేషనల్ వెదర్ సర్వీస్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మంచు తుఫాను మరో 3 రోజులు కొనసాగనుందని, ప్రజలు సురక్షితంగా ఇళ్లలోనే ఉండాలని అధికారులు ప్రకటించారు.
- Tags
- Snow Storm
- USA






