- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG : మరో గంటలో ఈ జిల్లాల్లో భారీ వర్షం
ఎల్ నినో ప్రభావం వల్ల రుతుపవనాలు వెనక్కి వెళ్లడంతో తెలంగాణ వ్యాప్తంగా తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : ఎల్ నినో ప్రభావం వల్ల రుతుపవనాలు వెనక్కి వెళ్లడంతో తెలంగాణ వ్యాప్తంగా తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ప్రజలకు కాస్త ఊరటనిచ్చే చల్లని కబురు చెప్పింది. తీవ్రమైన వేడి నుంచి ఉపశమనం కలిగిస్తూ ఉదయం 7 గంటల ప్రాంతంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ విభాగం (HMD) వెల్లడించింది.
వాతావరణ శాఖ సమాచారం ప్రకారం.. వరంగల్, హనుమకొండ, జనగాం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఈ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాల ప్రజలకు వర్ష సూచనతో ఉపశమనం లభించనుండగా, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వాసులకు మాత్రం వాతావరణ శాఖ నిరాశే మిగిల్చింది. నగరానికి ఈరోజు ఎలాంటి వర్ష సూచన లేదని స్పష్టం చేసిన అధికారులు, ఇక్కడ ఎండ తీవ్రతతో పాటు ఉక్కపోత మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. దీంతో జిల్లాల్లో వాతావరణం చల్లబడనుండగా, హైదరాబాద్ ప్రజలు మాత్రం మరికొంత కాలం ఈ తీవ్ర ఉక్కపోతను భరించక తప్పని పరిస్థితి నెలకొంది.






