- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG : పెన్షనర్లకు బిగ్ అలర్ట్
తెలంగాణలో 'చేయూత' పథకం ద్వారా పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక సమాచారాన్ని అందించింది.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో 'చేయూత' పథకం ద్వారా పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక సమాచారాన్ని అందించింది. పెన్షనర్లు తప్పనిసరిగా చేసుకోవాల్సిన 'లైవ్ నెస్ ఆథేన్టికేషన్' (Liveness Authentication) గడువును ఈనెల 22వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అర్హులైన వారందరికీ పెన్షన్లు సజావుగా అందేలా చూసేందుకు ఈ గడువును పొడిగించినట్లు అధికారులు తెలిపారు.
ఇంకా 5 లక్షల మంది పెండింగ్
రాష్ట్రవ్యాప్తంగా చేయూత పథకం కింద లబ్ధి పొందుతున్న పెన్షనర్ల సంఖ్య సుమారు 19 లక్షల వరకు ఉంది. అయితే, ప్రభుత్వం ఇచ్చిన మునుపటి గడువు లోగా ఇప్పటివరకు 14 లక్షల మంది లబ్ధిదారులు మాత్రమే తమ లైవ్ నెస్ ఆథేన్టికేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఇంకా దాదాపు 5 లక్షల మంది పెన్షనర్లు ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది.
గ్రామ అధికారులను సంప్రదించాలి
మిగిలిపోయిన లబ్ధిదారులందరితోనూ ఈనెల 22వ తేదీ లోగా ఆథేన్టికేషన్ ప్రక్రియను వంద శాతం పూర్తి చేయించాలని పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఇంకా ఎవరైనా పెన్షనర్లు ఈ ప్రక్రియ పూర్తి చేయకుండా పెండింగ్‌లో ఉంటే.. వారు వెంటనే తమ పరిధిలోని గ్రామ అధికారులను సంప్రదించి, గడువు ముగిసేలోగా లైవ్ నెస్ ఆథేన్టికేషన్‌ను పూర్తి చేసుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. నిబంధనల ప్రకారం ఈ ప్రక్రియ పూర్తి చేయని వారికి భవిష్యత్తులో పెన్షన్ నిలిచిపోయే ప్రమాదం ఉందని సమాచారం.






