కాక్రోచ్ పార్టీ ఎన్నికల బరిలోకి దిగనుందా?

by Muthe.Rajitha |

రాబోయే ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన తమకు లేదని కాక్రోచ్ జనతా పార్టీ(CJP) తేల్చి చెప్పింది.

కాక్రోచ్ పార్టీ ఎన్నికల బరిలోకి దిగనుందా?
X

దిశ, వెబ్ డెస్క్ : రాబోయే ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన తమకు లేదని కాక్రోచ్ జనతా పార్టీ(CJP) తేల్చి చెప్పింది. ఇటీవలి కాలంలో విద్యావ్యవస్థలోని లోపాలపై దేశవ్యాప్తంగా నిరసనలతో హోరెత్తిస్తున్న 'కాక్రోచ్ జనతా పార్టీ' తమ భవిష్యత్తు కార్యాచరణపై కీలక ప్రకటన చేసింది. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ ఎక్కడా పోటీ చేసే ఆలోచన లేదని CJP అధినేత అభిజిత్ దీప్కే స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తారా అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు దీప్తకే సమాధానం చెబుతూ.. హక్కుల కోసం పోరాడే ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో పోటీ చేయరని, తమ ఉద్దేశం ఎన్నికల రాజకీయాలు కాదని ఆయన తేల్చిచెప్పారు. తమ సంస్థ కేవలం ఎన్నికల్లో సీట్లు గెలవడానికి పెట్టింది కాదని, విద్యా వ్యవస్థలో జరుగుతున్న అనియమితులు, పేపర్ లీకులు, దేశాన్ని వేధిస్తున్న నిరుద్యోగం వంటి తీవ్రమైన సమస్యలపై పోరాడే ఒక నిరసనా ఉద్యమంగా మాత్రమే కొనసాగుతుందని వివరించారు.

ఈ తాజా ప్రకటనతో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తన ఆశయాలను, ఉద్దేశాలను ప్రజల ముందు మరింత స్పష్టంగా ఉంచింది. అధికారం కోసం కాకుండా, కేవలం విద్యార్థుల, నిరుద్యోగ యువత హక్కుల కోసమే తాము నిలబడతామని చాటిచెప్పింది. ప్రస్తుతం ఈ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా విద్యా సంస్కరణల కోసం, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ధర్నాలు, శాంతియుత నిరసనలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. కాగా ఇటీవల జైపూర్ లో జరిగిన దాడి వెనుక RSS హస్తం ఉందని అభిజిత్ దీప్కే ఆరోపించారు.

Next Story