మిర్యాలగూడలో భారీ వర్షం

by Jakkula.Mamatha |

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో బారీ వర్షం పడింది.

మిర్యాలగూడలో భారీ వర్షం
X

దిశ, మిర్యాలగూడ టౌన్: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో బారీ వర్షం పడింది. గురువారం సాయంత్రం ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. దీంతో పట్టణంలోని పలు వార్డులలో నీరు ఉధృతంగా ప్రవహించింది. ముఖ్యంగా నల్గొండ రోడ్డులో ముస్లిం ఖబరస్థాన్ వద్ద నీరు రోడ్డుపై నిలిచింది. దీని వలన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మురికి కాలువ పూడిక పోవడంతో సమస్య తలెత్తింది. బస్టాండ్ లో నీరు నిలిచి ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. మున్సిపాలిటీ అధికారులు స్పందించి నీరు నిల్వ ఉన్న ప్రదేశాల పై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story