కొలంబోలో భారీ వర్షం.. పాకిస్తాన్, న్యూజిలాండ్ మ్యాచ్ రద్దు

by Malleboina Mahesh |

"కొలంబోలో కురిసిన భారీ వర్షం కారణంగా పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన సూపర్-8 తొలి మ్యాచ్ ఒక్క బంతి కూడా పడకుండా రద్దయింది. దీంతో చెరొక పాయింట్ ఇచ్చారు.

కొలంబోలో భారీ వర్షం.. పాకిస్తాన్, న్యూజిలాండ్ మ్యాచ్ రద్దు
X

దిశ, వెబ్‌డెస్క్: టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 దశపై ఎన్నో అంచనాలు పెట్టుకున్న అభిమానులకు ఆదిలోనే అనూహ్య షాక్ తగిలింది. హైఓల్టేజ్ నడుమ జరగాల్సిన పాకిస్తాన్, న్యూజిలాండ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో టాస్ గెలిచిన పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నప్పటికీ, మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందే వరుణుడు ఆటంకం కలిగించాడు. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షం వల్ల మైదానం చిత్తడిగా మారడంతో, అంపైర్లు కనీసం ఒక్క బంతి కూడా పడకుండానే ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

ఐసీసీ నిబంధనల ప్రకారం సూపర్-8 మ్యాచ్‌లకు రిజర్వ్ డే లేకపోవడంతో, రెండు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. ఈ పరిణామం ఇరు జట్ల సెమీఫైనల్ అవకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. సెమీస్ రేసులో నిలవాలంటే కివీస్, పాక్ జట్లు తమ తదుపరి రెండు మ్యాచుల్లో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ టోర్నీలో వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడం ఇది రెండోసారి కావడం గమనార్హం.

Next Story