నేడు తెలంగాణకు భారీ వర్ష సూచన

by Muthe.Rajitha |

రాష్ట్రంలో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

నేడు తెలంగాణకు భారీ వర్ష సూచన
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల మూడు రోజులు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నేడు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు 40 నుండి 50 కి.మీ వేగంతో కూడిన భారీ వర్షాలు నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. గ్రేటర్ పరిధిలో భారీ వర్షం నేపథ్యంలో సైబరాబాద్ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సోమవారం ఆఫీసులకు వెళ్లిన వాళ్లు, విద్యార్థులు మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఆఫీస్ నుండి లాగౌట్ అయి ఇళ్లకు చేరుకోవాలని సైబరాబాద్ పోలిస్ కమిషనర్ ఒక ప్రకటన విడుదల చేశారు. కానీ సిటీలో వర్షం కురవక పోవడం గమనార్హం.

42 గరిష్ట ఉష్ణోగ్రత

నేడు ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో అత్యధికంగా 42.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. జగిత్యాల జిల్లా మల్లాపూర్ లో 42.8, నిజామాబాద్ జిల్లా బాల్కొండలో 42.7, కుమరం భీం జిల్లా దహేగాంలో 42, మంచిర్యాల జిల్లా భీమినిలో 41.9, నిర్మల్ జిల్లా కుంటాలలో 41.5, పెద్దపల్లి జిల్లా అంతర్గావ్ లో 41.5, కరీంనగర్ జిల్లా చొప్పదండిలో 40.7, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లిలో 40.3 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.

వర్షపాతం

పెద్దపల్లి జిల్లా మంథనిలో 3.4 సెం.మీ, నిజామాబాద్ జిల్లా నందిపేట్ లో 2.9 సెం.మీ, రాజన్నసిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లిలో 2.6 సెం.మీ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లిలో 2.5 సెం.మీ, కుమరం భీం జిల్లా పెంచికల్ పేట్ లో 2.5 సెం.మీ, ములుగు జిల్లా మంగపేట్ లో 2.2 సెం.మీ, నిజామాబాద్ జిల్లా దొంకేశ్వర్ లో 2 సెం.మీ ల చొప్పున వర్షాపాతం నమోదైంది.

Next Story