- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెడ్ అలర్ట్... ఈ జిల్లాలకు ఎండదెబ్బ!
నేడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన వడగాలులు, పొడి వాతావరణం, భారీ ఎండలు ఉంటాయని వాతావరణశాఖ పేర్కొంది.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్. నేడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన వడగాలులు, పొడి వాతావరణం, భారీ ఎండలు ఉంటాయని వాతావరణశాఖ పేర్కొంది. ఏప్రిల్ 27 నుండి 30 మధ్య కాలంలో ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత గరిష్ట స్థాయికి చేరుకుని ఉష్ణోగ్రతలు 44-46°C వరకు నమోదయ్యే అవకాశం ఉంది. ఇదే సమయంలో దక్షిణ. తూర్పు తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని, ముఖ్యంగా ఏప్రిల్ 28, 29 తేదీల్లో హైదరాబాద్‌లో కూడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ నివేదికలు సూచిస్తున్నాయి. ఇక రాష్ట్రంలో రాబోయే పది రోజుల వాతావరణం అత్యంత అస్థిరంగా ఉండబోతోందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఒకవైపు భానుడి భగభగలు, మరోవైపు అకస్మాత్తుగా కురిసే ఉరుములతో కూడిన వర్షాలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేయనున్నాయని తెలిపారు. మే నెల ప్రారంభంలో వాతావరణం మళ్లీ వేడెక్కనుంది. మే 1 నుండి 3 వరకు దక్షిణ మరియు తూర్పు తెలంగాణ జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీస్తాయి. ఉష్ణోగ్రతలు 44-45°C గా నమోదయ్యే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రధానంగా పొడి వాతావరణం ఉండనుంది. అయితే, మే 4 నుండి 8 మధ్య వాతావరణంలో మరో మార్పు రానుంది. హైదరాబాద్‌తో సహా తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
వడగాలుల తీవ్రత తగ్గినప్పటికీ, సాధారణ ఉష్ణోగ్రతలు మాత్రం 41-43°C మధ్యే కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు. వడగాలులు మరియు వర్షాలు కలగలిసిన ఈ వింత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు, అకస్మాత్తుగా కురిసే వర్షాలు మరియు వీచే ఈదురుగాలుల సమయంలో సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి.






