- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాబోయే మూడు రోజులు భానుడి భగభగలు
తెలంగాణలో మరో మూడు రోజులు భానుడు తన ప్రతాపం చూపించనున్నట్టు వాతావరణశాఖ నిపుణులు హెచ్చరించారు.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో మరో మూడు రోజులు భానుడు తన ప్రతాపం చూపించనున్నాడు. ఏప్రిల్ 26 నుంచి 28 వరకు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరగనున్నట్టు వాతావరణశాఖ నిపుణులు హెచ్చరించారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ నిప్పుల కొలిమిగా మారనుందని తెలిపారు. ముఖ్యంగా ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్ జిల్లాల్లో ఎండల తీవ్రత గరిష్టంగా ఉండనుంది. ఇక్కడ ఉష్ణోగ్రతలు ఏకంగా 45°C మార్కును తాకే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ రాజధాని నగరంలో కూడా ఎండలు దంచికొట్టనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 43°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా వేడి గాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. కాగా ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు ఏప్రిల్ 28 నుండి ఊరట లభించనుంది. తొలుత దక్షిణ, పశ్చిమ తెలంగాణలో ప్రారంభమయ్యే ఉరుములతో కూడిన వర్షాలు, ఆ తర్వాత హైదరాబాద్‌తో సహా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలకు విస్తరించనున్నాయి. ఇక రానున్న 3 రోజులు వడదెబ్బ తగలకుండా మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు.






