- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హాలీమ్ ఆరోగ్య ప్రయోజనాలు.. మరీ ఈ సమస్యున్న వారు తినొచ్చా..?
హలీమ్(haleem)ను రంజాన్ (Ramadan) మాసంలో ఎక్కువగా తింటుంటారు.

దిశ, వెబ్‌డెస్క్: హలీమ్(haleem)ను రంజాన్ (Ramadan) మాసంలో ఎక్కువగా తింటుంటారు. హలీమ్‌ను కాయధాన్యాలు, మాంసం, గోధుమలు, బియ్యం, సుగంధ ద్రవ్యాల మిశ్రమాన్ని ఉడికించి రెడీ చేస్తారు. అలాగే హలీమ్ విత్తనాలను ఒక గ్లాసు వాటర్ నానబెట్టి.. ఉదయం అవి జిలాటినస్ అవుతాయి. ఈ మిశ్రమాన్ని నేరుగా తాగుతారు. లేదా పాలు, స్మూతీలు, పెరుగు లేదా నచ్చిన ఇతర పానీయాలలో కలిపి తాగుతారు.
హలీమ్‌లో ప్రోటీన్, విటమిన్లు, ఫోలేట్ (Folate), ఫైబర్, ఇనుము, విటమిన్ సి, ఎ వంటి పోషకాలు దట్టంగా ఉంటాయి. హలీమ్‌ను తినడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. అలాగే మలబద్ధకానికి చికిత్స చేస్తుంది. రోగనిరోధక శక్తి (Immunity)ని పెంచుతుంది. జుట్టు రాలడాన్ని (Hair fall)తగ్గిస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
హలీమ్ గింజలు జుట్టు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉండే పోషకాల యొక్క పవర్‌హౌస్. ఈ చిన్న విత్తనాలు విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు, కొవ్వు ఆమ్లాలతో నిండి ఉంటాయి. ఇవన్నీ బలమైన, ఆరోగ్యకరమైన జుట్టును ప్రోత్సహించడానికి చాలా ముఖ్యమైనవి. హాలీం తింటే ఎనర్జీ వస్తుంది. అలాగే కండరాలకు బలం(Muscle strength) పెంచుతుంది. ఈ రంజాన్ మాసంలో హాలీమ్ తింటే వెయిట్ కూడా లాస్ అవుతారని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఫైబర్ (Fiber) అధికంగా ఉంటుంది. హాలీమ్‌లో ఉండే పీచు పదార్థం ఆకలిని ఎక్కువ సమయం పాటు ఆపుతుంది.
తద్వారా బరువు తగ్గే (Weight loss) అవకాశం ఉంటుంది. ముఖ్యంగా హాలీమ్ తయారీలో వెల్లుల్లి, అల్లం, పసుపు యాడ్ చేస్తే కిడ్నీ సంబంధిత వ్యాధులు (Kidney related diseases), హైబీపీ, హార్ట్ సమస్యలు, ఒత్తిడి, ఆందోళన వంటి వాటిని దూరం చేస్తాయి. కానీ గుండె సమస్యలు (Heart problems) ఉన్నవారు ఇంట్లోనే తయారు చేసుకుని తింటే మేలని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన సం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.






