వివాహానికి వెళ్తూ మృత్యు ఒడిలోకి

by Batti.Sumithra |   (  Updated:2026-06-06 16:11:59  IST  )

బంధువుల వివాహానికి వెళ్తూ ప్రమాదానికి గురై ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం తెల్లవారుజామున చిట్యాల పట్టణ శివారులో చోటుచేసుకుంది.

వివాహానికి వెళ్తూ మృత్యు ఒడిలోకి
X

దిశ, చిట్యాల : బంధువుల వివాహానికి వెళ్తూ ప్రమాదానికి గురై ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం తెల్లవారుజామున చిట్యాల పట్టణ శివారులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, చిట్యాలకు చెందిన గౌస్‌మియా తన బంధువుల వివాహానికి రామన్నపేటలోని జేపీ గార్డెన్‌కు స్కోడా కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున సుమారు 1:30 గంటల సమయంలో చిట్యాల శివారులోని మూలమలుపు వద్ద ముందుగా వెళ్తున్న లారీని ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించారు. అదే సమయంలో భువనగిరి నుంచి చిట్యాల వైపు వస్తున్న బొలెరో వాహనాన్ని కారు ఢీ కొట్టింది. ఢీకొన్న ప్రభావంతో కారు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఖమ్మం నివాసి షేక్ జావేద్ భాష (38) తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు.

Next Story