- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతీ ఇంటికి వెళ్లండి.. హరీష్ రావు పిలుపు
త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని మొత్తం 17 మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

దిశ, తెలంగాణ బ్యూరో: త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని మొత్తం 17 మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో సోమవారం ఉమ్మడి మెదక్ జిల్లా మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం హరీశ్‌రావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందన్నారు. పల్లెల నుంచి పట్టణాల దాకా అంతా అస్తవ్యస్తమేనని.. పట్టణ ప్రగతితో దేశానికి ఆదర్శంగా నిలిచిన మున్సిపాలిటీలు నేడు నిర్వహణ లేక కళ తప్పాయన్నారు. కనీసం వీధి లైట్లు వేయలేని పరిస్థితి వచ్చిందని.. మురికి కాలువలు శుభ్రం చేయలేని దయనీయ స్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నదని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా మున్సిపాలిటీల రూపురేఖలే మారిపోయాయన్నారు. కానీ.. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ఇవ్వక, ఉన్నవాటిని నిర్వహించలేక పట్టణాలను గాలికొదిలేసిందన్నారు.
ప్రతి ఇంటికి వెళ్లాలని సూచిన
అధికారంలోకి వస్తే వృద్ధులకు రూ.4,000 పింఛను, మహిళలకు రూ.2,500, విద్యార్థులకు భరోసా ఇస్తామని చెప్పి.. గద్దెనెక్కాక ఆ హామీలన్నింటినీ తుంగలో తొక్కిందన్నారు. ప్రజలను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ తీరును ఎక్కడికక్కడ ఎండగట్టాలని పిలుపునిచ్చారు. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మంచి విజయాన్ని సాధించిందని.. అదే ఉత్సాహంతో రానున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ పార్టీని మరింత బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. నాయకులంతా ఏకతాటిపై నిలిచి ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలు, నాయకులు ప్రతి ఇంటికి వెళ్లాలని సూచించారు. సోషల్ మీడియాలోనూ, జనంలోనూ కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ ప్రచారం చేయాలన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాణిక్యరావు, సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, శంభీపూర్ రాజుతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, 17 మున్సిపాలిటీలకు సంబంధించిన ఇన్‌చార్జీలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.






