- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యుత్ ఉద్యోగుల పట్ల సర్కారు మొండి వైఖరి : హరీష్ రావు
విద్యుత్ ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న మొండి వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : విద్యుత్ ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న మొండి వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. మింట్ కాంపౌండ్‌లో భారీ ఎత్తున ఆందోళన చేస్తున్న దాదాపు 10 వేల మంది విద్యుత్ ఉద్యోగులు, వారి కుటుంబాల ఆవేదన ఈ ప్రభుత్వానికి వినిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. ఎర్రగడ్డ స్కాడా కార్యాలయంలో జరిగిన చర్చల్లో యాజమాన్యం ప్రదర్శించిన తీరు పూర్తిగా దుర్మార్గమైందని, బదిలీలను వాయిదా వేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పడం ప్రభుత్వ అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. పిల్లల చదువులు నడుస్తున్న సమయంలో, విద్యా సంవత్సరం పూర్తికాకముందే బదిలీలు చేపట్టి వారి భవిష్యత్తుతో చెలగాటం ఆడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
కనీసం జూన్ వరకు ఆగాలని ఉద్యోగులు కోరుతున్నా ప్రభుత్వానికి కనికరం లేదని విమర్శించారు. విద్యుత్ జేఏసీల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, గురువారం నుంచి చేపట్టబోయే రిలే దీక్షలకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని హరీష్ రావు ప్రకటించారు. ఉద్యోగులను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని హెచ్చరిస్తూ, వెంటనే బదిలీలను వాయిదా వేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.






