రాజకీయ పునరావాస కేంద్రాలుగా కార్పొరేషన్లు : హరీశ్‌రావు

by Muthe.Rajitha |

సీఎం రేవంత్‌రెడ్డికి కార్పొరేషన్ పదవులు ఇవ్వడంపై ఉన్న శ్రద్ద, నిధులు విడుదల చేయడంలో లేదని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజకీయ పునరావాస కేంద్రాలుగా కార్పొరేషన్లు : హరీశ్‌రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్‌రెడ్డికి కార్పొరేషన్ పదవులు ఇవ్వడంపై ఉన్న శ్రద్ద, నిధులు విడుదల చేయడంలో లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ‘ఎక్స్’లో ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు, విధులు లేకుండా కార్పొరేషన్లను నిర్వీర్యం చేసిన ఘనత రేవంత్‌రెడ్డికే దక్కుతుందని పేర్కొన్నారు. కార్పొరేషన్లను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చి ఏం సాధిస్తారని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డికి సంక్షేమంపై దృష్టి కంటే అనుచరులను సంతృప్తి పరచడంపైనే దృష్టి ఉన్నదని ఎద్దేవా చేసారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 33 కార్పొరేషన్లకు నిధులు కేటాయించడంలో తీవ్ర నిర్లక్ష్యం చూపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు మరికొందరికి పదవులు ఇవ్వడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. నిధులు విడుదల చేయకపోవడంతో, మొదటి దఫాలో నియమితులైన చైర్మన్లు ప్రజలకు ఒక్క రూపాయి కూడా సాయం చేయకుండా వారి పదవీకాలాన్ని ముగించారని గుర్తు చేశారు. 33 కార్పొరేషన్లకు గాను 21 కార్పొరేషన్లకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా అసలు ఉద్దేశ్యాన్ని నిర్వీర్యం చేస్తున్నారని పేర్కొన్నారు.

Next Story