సంతోషంగా బీజేపీకి మద్దతిస్తాం.. మేఘాలయ సీఎం కన్రాడ్ సంగ్మా

by Disha Web Desk 17 |
సంతోషంగా బీజేపీకి మద్దతిస్తాం.. మేఘాలయ సీఎం కన్రాడ్ సంగ్మా
X

షిల్లాంగ్: బీజేపీకి మద్దతు ఇవ్వడాన్ని సంతోషంగా ఒప్పుకుంటామని మేఘాలయ సీఎం, నేషనల్ పీపుల్స్ పార్టీ చీఫ్ కన్రాడ్ కె సంగ్మా అన్నారు. 'మణిపూర్‌లో బీజేపీ మద్దతు ఇవ్వమని మమ్మల్ని ఆహ్వానిస్తే, మేము సంతోషంగా ప్రభుత్వంతో కలుస్తాం' అని అన్నారు. కేంద్రంలో, మేఘాలయాలో తమ పార్టీ ఎన్డీఏ కూటమిగా ఉందని చెప్పారు. అంతేకాకుండా అరుణాచల్ ప్రదేశ్‌లోనూ పొత్తు పెట్టుకున్న విషయాన్ని ప్రస్తావించారు. ఈ సారి మణిపూర్ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన ఎన్పీపీ 7 సీట్లు గెలుపొందింది. రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన రెండో పార్టీగా నిలిచింది. కాగా 60 స్థానాల్లో 32 సీట్లు గెలిచి బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అయితే సంగ్మా నేతృత్వంలోని ఎన్పీపీతో కలిపితే ఆ సంఖ్య 38కు చేరనుంది. మరోవైపు పలువురు బీజేపీ నేతలు ఎన్పీపీని వ్యతిరేకిస్తున్నారు.


Next Story

Most Viewed