- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపటి నుండి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు
by Muthe.Rajitha |
రాష్ట్రంలో రేపటి నుండి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు కొనసాగనున్నాయి.

X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో నేటి నుండి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు కొనసాగనున్నాయి. ప్రతి రోజు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పాఠశాలల పనిచేస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం 12.30 గంటలకు మధ్యాహ్న భోజనం అందిస్తారు. పదోతరగతి పరీక్షా కేంద్రాలు ఉన్న స్కూళ్లు, పరీక్షలు జరిగే రోజుల్లో మాత్రమే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయని అధికారులు చెబుతున్నారు. పరీక్షలు లేని రోజుల్లో పాఠశాలలు ఉదయం పూట యథావిధిగా కొనసాగుతాయి. ఈ ఒంటిపూట బడులు 2025-26 విద్యా సంవత్సరం చివరిరోజైన ఏప్రిల్ 23 వరకు కొనసాగుతాయి.
- Tags
- Half Day schools
Next Story






