- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాఠశాలలో దుండగుడి కాల్పులు.. 10 మంది మృతి
తుపాకితో పాఠశాలలో దూరిన ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ ఘటన కెనడాలోని బ్రిటిష్ కొలంబియా రాష్ట్రం, టంబ్లర్ రిడ్జ్ (Tumbler Ridge) పట్టణంలో చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: తుపాకితో పాఠశాలలో దూరిన ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ ఘటన కెనడాలోని బ్రిటిష్ కొలంబియా రాష్ట్రం, టంబ్లర్ రిడ్జ్ (Tumbler Ridge) పట్టణంలో చోటు చేసుకుంది. సెకండరీ పాఠశాలలోకి చొరబడిన ఒక దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ దాడిలో నిందితుడితో కలిపి మొత్తం 10 మంది ప్రాణాలు కోల్పోయారు. పాఠశాల లోపల ఆరుగురు మరణించగా, ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు చనిపోయారు. అలాగే పోలీసులు నుంచి తప్పించుకునే ప్రయత్నంలో పాఠశాల సమీపంలోని ఒక ఇంట్లో దూరిన నిందితుడు.. మరో ఇద్దరిని కాల్చి చంపినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
ఈ దారుణ ఘటనలో సుమారు 27 మంది గాయపడ్డ వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. దుండుగు హైక్వాలిటి గన్ ఉపయోగించడంతో బుల్లెట్ తగిలిన వారు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే ఈ కాల్పులకు పాల్పడిన దుండగుడు.. తన గన్ లో బులెట్స్ అయిపోయే సమయంలో తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు గుర్తించారు. ఈ దాడి చేసిన వ్యక్తి ఒక మహిళా వేషధారణలో (Female Disguise) వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలుస్తోంది.
కాగా ఈ దారుణమైన ఘటనతో కెనడా దేశవ్యాప్తంగా విషాద ఛాయలు అలముకున్నాయి. సాధారణంగా కెనడాలో ఇలాంటి పాఠశాల కాల్పుల ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. దీంతో ప్రభుత్వం ఈ విషయాన్ని అత్యంత తీవ్రంగా పరిగణిస్తోంది. కాల్పుల వార్త తెలియగానే అధికారులు చుట్టుపక్కల ఉన్న విద్యాసంస్థలను లాక్-డౌన్ చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతం అక్కడ ఎలాంటి ప్రమాదం లేదని, పోలీసులు ఈ దాడికి గల కారణాలపై లోతైన విచారణ జరుపుతున్నారని అధికారులు ప్రకటించారు.






