WPL.. యూపీపై గుజరాత్ విజయం

by Muthe.Rajitha |

WPL లో భాగంగా నేడు గుజరాత్ టైటాన్స్ 45 పరుగుల తేడాతో యూపీపై విజయం సాధించింది.

WPL.. యూపీపై గుజరాత్ విజయం
X

దిశ, వెబ్ డెస్క్ : WPL లో భాగంగా నేడు వడోదర వేదికగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 45 పరుగుల తేడాతో యూపీపై ఘన విజయం సాధించింది. ఈ సీజన్‌లో గుజరాత్ కు ఇది మూడో విజయం. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. సోఫీ డివైన్ 50 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు కీలక ఇన్నింగ్స్ అందించగా, బెత్ మునీ 38 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన యూపీ జట్టు 17.3 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌటైంది. లిచ్‌ఫీల్డ్ 32, ట్రయాన్ 30 పరుగులు తప్ప మిగతా బ్యాటర్లు రాణించలేదు. గుజరాత్ బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్ 3 వికెట్లు తీసుకోగా, రేణుకా సింగ్, సోఫీ డివైన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. దీంతో గుజరాత్ జట్టు పూర్తి ఆధిపత్యంతో మ్యాచ్‌ను గెలుచుకుంది.

Next Story